NTV Telugu Site icon

Balayya: ఈ దసరాకి నట సింహం ఆయుధపూజ…

Balayya

Balayya

2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సంక్రాంతికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, ఈ దసరాకి ఆయుధ పూజ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ NBK 108 అనేవర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని దసరా బరిలో నిలబెడుతూ మేకర్స్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 21న బాలయ్య-అనీల్ రావిపూడిల సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. “ఈ విజయ దశమికి ఆయుధపూజ” అంటూ మేకర్స్ ఒక పోస్టర్ ని విడుదల చేశారు. బాలయ్య ఉగ్రరూపంలో ఉన్నట్లు కనిపిస్తున్న పోస్టర్ లో, అమ్మవారు కూడా ఉన్నారు.

అనీల్ రావిపూడి తెలంగాణా యాసలో బాలయ్య మాట్లాడించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి, వీటిని మరింత పెంచుతూ మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ ని వదులుతూనే ఉన్నారు. శ్రీలీలా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ సెట్స్ లోకి కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. బాలయ్యని నెవర్ బిఫోర్ లుక్ లో చూపిస్తానని చెప్తున్న అనీల్ రావిపూడి ఫస్ట్ ఫేజ్ లో షూటింగ్ చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా అనుకున్న టైంకి కంప్లీట్ చేసి దసరాకి ఎట్టి పరిస్థితిలో సినిమాని విడుదల చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. బాలయ్య అనగానే సాలిడ్ మ్యూజిక్ ఇస్తున్న తమన్, మరోసారి NBK 108 కోసం రంగంలోకి దిగనున్నాడు.

NBK 108 రిలీజ్ అవుతున్న దసరా సీజన్ కే బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలకి స్ట్రాంగ్ పోటీ ఇస్తూ పాన్ ఇండియా స్థాయిలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ రిలీజ్ కానుంది. దసరా సీజన్ అంటే 10 రోజులు హాలీడేస్ ఉంటాయి కాబట్టి దాన్ని కాష్ చేసుకోవడానికి ఈ మూడు సినిమాలు గట్టిగానే ప్రయత్నిస్తాయి. మరి వీటిలో ఏ సినిమా హిట్ అవుతుంది? వాయిదా పడకుండా మూడు సినిమాలు రిలీజ్ అవుతాయా? బాలయ్య కోసం బోయపాటి వెనక్కి తగ్గుతాడా? బాలయ్య-రవితేజల మధ్య ఒకప్పుడు ఉన్న క్లాష్ మరోసారి మొదలు కాబోతుందా లాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే అక్టోబర్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Show comments