Site icon NTV Telugu

NBK 109: ‘అఖండ 2’ అనౌన్స్మెంట్ లోడింగ్!

Nbk 109

Nbk 109

2023 సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ఈ దసరాకు కూడా దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి బాలయ్య లుక్ బయటకి వచ్చింది, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య సూపర్ ఉన్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తూ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న.. ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జూన్ 10న బాలయ్య నుంచి నందమూరి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే మరో అప్డేట్ కూడా రెడీ అవుతోంది. బాలయ్య, బోయపాటి.. ఈ డెడ్లీ కాంబినేషన్ గురించి వింటే నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి.

సింహా, లెజెండ్, అఖండ.. ఈ సినిమాలతో బాలయ్యను ఎవరూ చూపించని కోణంలో చూపించి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు బోయపాటి. అందుకే మరోసారి ఈ కాంబో మరింత పవర్ ఫుల్‌గా రాబోతోంది. కరోనా టైంలో ఆడియన్స్ థియేటర్స్ లోకి రారేమో అనే భయం ఒక వైపు, టికెట్ రేట్ తగ్గించడంతో పెట్టిన డబ్బులు వస్తాయో రావో అనే భయం ఇంకో వైపు. ఇలాంటి పరిస్థితిలో  సినిమా బాగుంటే ఆడియన్స్  థియేటర్స్ లోకి వస్తారు అని నిరూపించిన సినిమా అఖండ. ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలే కాదు.. తమన్ బీజిఎంతో థియేటర్ బాక్సులు  కూడా బద్దలయ్యాయి. ఇప్పటికే బాలయ్య, బోయపాటి ‘అఖండ 2’ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్నారు. ప్రస్తుతం బోయపాటి, రామ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ అయిపోయే లోపు బాలయ్య NBK 108 కూడా అయిపోతే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. అది అఖండ 2నా లేక పాలిటిక్స్ ని టచ్ చేస్తూ వేరే కథతో సినిమా చేస్తారా అనేది జూన్ 10న బాలయ్య బర్త్ డే రోజున వచ్చే అనౌన్స్మెంట్ తో తెలియనుంది.

Exit mobile version