బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, వీర సింహా రెడ్డి సక్సస్ మీట్ లో ఫుల్ జోష్ లో కనిపించాడు. ఈ సక్సస్ మీట్ లో గెస్టుగా వచ్చిన అనీల్ రావిపూడి, బాలయ్యతో చేస్తున్న సినిమా గురించి మాట్లాడాడు. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. బాలయ్య స్టైల్ లోనే ఉండే అనీల్ రావిపూడి సినిమాగా NBK 108 ప్రమోట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే అనీల్ రావిపూడి, సీరియస్ రోల్స్ చేసే బాలయ్యలు కలిసి ఎలాంటి సినిమా చేస్తారో అని నందమూరి అభిమానులు అనుకుంటూ ఉండగా… NBK 108 సినిమా అదిరిపోతుంది, ఈసారి కలెక్షన్ల ఊచకోత చూస్తారు అని చెప్పాడు అనీల్ రావిపూడి.
ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలని షేర్ చేసుకున్న అనీల్ రావిపూడి… బాలయ్య టచ్ ని యాడ్ చేస్తూ బయటకి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యింది. NBK 108 కూడా బాలయ్య టచ్ తోనే ఉంటుంది కాకపోతే ఈసారి సింహం సీమలో కాదు తెలంగాణాలో దిగుతుంది అని చెప్పాడు. బాలయ్య నుంచి తెలంగాణా యాసలో పవర్ ఫుల్ డైలాగులు వినబోతున్నాం అనే విషయం కొత్తగా ఉంది. రెగ్యులర్ గా సీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేసే బాలయ్యకి NBK 108 మంచి చేంజ్ ఓవర్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలకి సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్, NBK 108కి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండడంతో ఈ మూవీ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎలాంటి లోటు ఉండదని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు.
