Site icon NTV Telugu

Nandamuri Balakrishna: ముందు ఏం చేశాం.. వెనుక ఎవడిని వేసాం.. వేదిక ఎక్కాలంటే ఒక అర్హత ఉండాలి

Bala

Bala

Nandamuri Balakrishna: విలక్షణ నటుడు జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించిన చిత్రం రుద్రంగి. శాసనసభ్యులు రసమయి బాలకిషన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రివర్యులు హరీష్‌రావు, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టేశాడు. ” మా అయ్య ఎప్పుడు ఒకమాట చెప్తుండేవాడు. ఏడ ఉండో.. మనగురించి మనం చెప్పుకొనేటప్పుడు.. ముందు ఆడు ఉన్నాడు.. వెనుక ఈడు ఉన్నాడు.. గా ముచ్చట కాదు.. ముందు ఏం చేశాం.. వెనుక ఎవడిని వేసాం.. గా ముచ్చట చెప్పాలి.. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. నా సోదరుడు రసమయి.. మేము రాజకీయాల్లో ఉన్నాం.. కానీ మాకు రాజకీయాలు తెలియవు.” అని చెప్పుకొచ్చాడు.

Mahesh Babu: దిల్ రాజు వారసుడు ఫంక్షన్ లో.. తండ్రీకూతుళ్ళ రచ్చ

ఇక రుద్రంగి సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ.. ఈ సినిమా.. సినిమా కాదు నా దృష్టిలో.. కొన్ని సినిమాలు వినోదం కోసం చూస్తాం.. కొన్ని సినిమాలు మనముందే పాత్ర లేకపోయినా.. మనం కూడా అందులో పాత్రదారులమై.. ప్రత్యేక్షంగా జరుగుతున్నాయి అనిపిస్తుంది. కొన్ని సినిమాలు పాత్రలు అన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి. అందులో ఈ సినిమా ఒకటి. ఆ కోవలోకి జగపతి బాబు కూడా చేరాడు. అలాంటి వారితో వేదిక పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వేదిక పంచుకోవాలన్నా ఒక అర్హత కావాలి. అందుకే అంటారు మహానుభావులు అని .. మహా ఔన్నత్యం కలిగినవారే మహానుభావులు అవుతారు అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా గురించి అందులో ఉన్న పాత్రలు గురించి బాలయ్య మాట్లాడాడు. జగపతి బాబు చాలా గొప్ప నటుడు.. ఆయనతో కలిసి నేను చాలా సినిమాలు చేశాను. ఆయనకు ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటునానట్లు తెలిపాడు. ఇక క్యాన్సర్ తో పోరాడిన మమతా మోహన్ దాస్ గురించి బాలయ్య మాట్లాడాడు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నాడు.

Exit mobile version