Site icon NTV Telugu

Nandamuri Balakrishna: బాలయ్య వార్నింగ్.. ఎవడైనా నన్ను బాబాయ్ అని పిలిస్తే.. దబిడి దిబిడే

Bala

Bala

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మూడు వారాల పాటు విజయవంతంగా థియేటర్లలో నిరాటకంగా కొనసాగుతోంది. మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ.99 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. మిగిలిన రెండు వారాల్లో రూ.26 కోట్ల మేర రాబట్టింది. మొత్తంగా రూ.125 కోట్ల మేర గ్రాస్.. రూ.69 కోట్ల మేర షేర్ వసూలు చేసింది. విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ చేసిందని టాక్. ఇక దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నేడు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొంది.

ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ తనదైన మాటలతో అలరించాడు. ముఖ్యంగా ఆయనను ఎవరైనా బాబాయ్ అని పిలిస్తే.. అస్సలు బాగోదని వార్నింగ్ కూడా ఇచ్చాడు.” లైఫ్ లో నన్ను ఎవరన్నా బాబాయ్ అని కానీ.. ఇంకా ఏదైనా అని పిలిస్తే జాగ్రత్త ఉండండి, దబిడి దిబిడే. అయినా ఈ సినిమాలో శ్రీలీల కి చిచ్ఛాగా చెయ్యటం అంటే .. ఒక మంచి సందేశం ఎప్పుడైతే అనిపించిందో..అంటే.. ఒక మంచి సందేశం అందించడం కోసం దేనికైనా త్యజించాలి. ఒక ఆర్టిస్ట్ గా మనంచెప్పింది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇంతకంటే వేరే మాధ్యమం ఏమి లేదు. ఆ సినిమా కూడా అందరు చెప్తే పలకదు. అది నా బాధ్యతగా స్వీకరించి.. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పి.. చేశాను. ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version