బాలయ్యని రామయ్యని చేస్తున్న గీతా ఆర్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈక్వెషన్స్ మారిపోయాయి. ఇంతకాలం అక్కినేని, మెగా ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అలానే అల్లు అరవింద్ సైతం అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ తో సినిమాలు నిర్మించి ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. పైగా చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో భాగస్వాములు కావడం కూడా వారి బంధాన్ని బలోపేతం చేసింది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ తన పరిథిని మరింత విస్తరింప చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణను సైతం తమతో కలుపుకుని ముందుకు సాగుతున్నారు. తన తండ్రి అల్లు రామలింగయ్య, మహానటుడు ఎన్టీయార్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆసరాగా తీసుకుని ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ఏకంగా నందమూరి బాలకృష్ణతో అన్ స్టాపబుల్ పేరుతో ఓ కార్యక్రమం చేస్తున్నారు.
Read Also : రోశయ్య మృతికి సినీ ప్రముఖుల సంతాపం
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
తాజాగా అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లోనూ బాలయ్య బాబుతో ఓ సినిమా ప్లాన్ చేశారని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ వార్తలు జోరందుకున్నాయి. పైగా ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ సైతం హాజరు కావడం, ఆహా వేడుకల్లో బాలకృష్ణను అరవింద్ విపరీతంగా పొగడటం ఇవన్నీ చూస్తుంటే, వీరి కాంబోలో సినిమా వచ్చే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సినిమా నిర్మిస్తారని, దానికి ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ లో సంపత్ నంది ఇంతవరకూ సినిమాలేవీ చేయకపోయినా, మెగా ఫ్యామిలీతో అతనికి మంచి అనుబంధమే ఉంది. ఆ కారణంగానే అల్లు అరవింద్ దర్శకుడు సంపత్ నందికి ఈ ఛాన్స్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి ‘రానే వస్తాడు రామయ్య’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?