Balakrishna-Nayanthara New Movie: నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ చివరగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఇచ్చిన కిక్కుతో బాలయ్య బాబు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నారు. భగవంత్ కేసరి చిత్రం 2023 దసరాకు రిలీజ్ కాబోతోంది.
ఇక ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య బాబు ఓ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా స్టార్ హీరోయిన్ నయనతార నటించనుందని సమాచారం తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే నయనతాను ఒప్పించారని టాక్. గతంలో బాలకృష్ణ, నయన్ కాంబినేషన్‌లో సింహా, శ్రీరామ రాజ్యం, జై సింహా సినిమాలు వచ్చాయి. ఈ కాంబో ఫిక్స్ అయితే నాలుగో సినిమా రానుంది.
Also Read: Garlic Side Effects: వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!
బాబీ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ మరో సినిమా చేస్తారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బంపర్ హిట్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నాలుగో సినిమాపై భారీ అంచనాలు ఉండనున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఆ నిరీక్షణకు తెర పడే అవకాశం ఉంది.
నయనతార గతేడాది దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నయన్ సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనించిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలతో చాలా బిజీ అయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు హిందీలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వస్తున్న ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నారు.
Also Read: Skin Care Tips: ఈ హోం రెమెడీ ట్రై చేస్తే.. మీ ముఖం చందమామలా మెరుస్తుంది!