NTV Telugu Site icon

Balakrishna: పార్టీలకు, కులాలకు అతీతంగా నేను సంపాదించిన ఆస్తి ఇదే- బాలయ్య

Balaya

Balaya

బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘డాకు మహారాజ్’ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో ఈ మూవీ మొదటి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించగా. చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, బేబీ వేద అగర్వాల్, ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు సమన్యాయం చేశారు.  దీంతో చూడానికి మూవీ స్టోరీ రోటీన్ గానే ఉన్న తీసిన విధానం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మొత్తనికి బాలయ్య బాబు చెప్పనట్లుగానే ‘డాకు మహారాజ్’ తో ఈ సంక్రాంతి సీజన్‌లో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

అయితే ‘డాకు మహారాజ్’ ఈవెంట్ లో భాగంగా బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ‘ ఫుడ్ విషయంలో నా భార్య వసుంధర నన్ను తిడుతూ ఉంటుంది. నేను ఫిట్‌గా ఉండేందుకు ప్రత్యేకమైన ఫుడ్ లాంటిది ఏం తీసుకోను. షూటింగ్ సమయంలో కూడా నేను ప్రొడక్షన్ ఫుడ్ తింటాను’ అని చెప్పాడు బాలకృష్ణ. అలాగే ‘పార్టీలకు, కులాలకు అతీతంగా నాకు అందరు అభిమానులు ఉన్నారు.. జీవితంలో నేను సంపాదించుకున్న ఆస్తి అదే’ అని బాలయ్య తెలిపారు. ప్రస్తుతం బాలయ్య మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.