Balakrishna: నందమూరి బాలకృష్ణ కోపం అందరికి తెల్సిందే. ఆయనకు నచ్చని పనిచేస్తే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాం అనేది కూడా చూసుకోడు. అభిమానులను చితకబాదడంలో బాలయ్య ఎక్స్ పర్ట్. అయితే కొట్టినా బాలయ్యే పెట్టినా బాలయ్యే అని అభిమానులకు తెలుసు కాబట్టి బాలయ్యపై ఏరోజు ఎవరు ఒక్క మాట కూడా అనరు. అందులోను బాలయ్యకు ఎక్కువగా చిరాకు తెప్పిస్తే తప్ప ఆయన కోపగించుకోడు. ఇక అభిమానులు అంటే ఆయనకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అభిమానులు కొట్టడానికి బౌన్సర్లను డబ్బు ఇచ్చి పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని.. వారికీ నన్ను అనే హక్కు ఉంది.. నాకు వారిని కొట్టే హక్కు ఉంది.. మా ఇద్దరి మధ్య అనుబంధం అలాంటిది అని చెప్పుకొచ్చేవాడట బాలయ్య. అందుకే బాలయ్య చుట్టూ బౌన్సర్లు ఉండరు.
ఇక తాజాగా మరోసారి బాలయ్య తన కోపాన్ని ప్రదర్శిచాల్సి వచ్చింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరుగుతున్న విషయం విదితమే. స్పెషల్ చాఫర్ లో ఒంగోలు కు చేరుకున్న బాలయ్యకు అభిమానులు, చిత్ర యూనిట్ ఘనస్వాగతం పలికారు. అదే సమయంలో ఒక వ్యక్తి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. బాలయ్య వస్తుండగానే శాలువా కప్పి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ అనుకోని ఘటనకు షాక్ అయిన బాలయ్య అతనిపై సీరియస్ అయ్యాడు. ఏయ్ అంటూ అతడిపై విరుచుకుపడ్డాడు. అయితే అక్కడ ఇక్కడి కూడా జరిగింది. సదురు వ్యక్తి బాలయ్యకు తెలియకుండా శాలువా కప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బాలయ్య తలపై ఉన్న గ్లాసెస్ కిందపడిపోయాయి. దీంతో బాలయ్యకు కోపం వచ్చిందే కానీ శాలువా కప్పినందుకు కాదు అనేది తెలుస్తోంది. ఆ శాలువాను భద్రంగా బాలయ్య పట్టుకువెళ్లడంతోనే ఆయన ప్రేమ అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
