NTV Telugu Site icon

Balakrishna Fans: మాకేందిరా ఈ శిక్ష అంటున్న బాలయ్య ఫాన్స్?

Balakrishna

Balakrishna

Balakrishna Fans on Re Release Movies: టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. స్టార్ హీరోల‌కు సంబంధించిన సినిమాల‌ను వారి అభిమానులు డిమాండ్ మేరకు 4K టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇప్ప‌టికే సింహాద్రి, ఖుషి, జ‌ల్సా, పోకిరి, చెన్న‌కేశ‌వ రెడ్డి, ఆరెంజ్, రఘువరన్ బీటెక్, నరసింహ నాయుడు, భైరవ ద్వీపం, ఇలా చాలా సినిమాలు అభిమానులను అలరించాయి. సింహాద్రి, ఖుషి, పోకిరి వంటి సినిమాలైతే రీ రిలీజ్ అయిన త‌ర్వాత కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రినీ షాక్ కి కూడా గురి చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు బాధ పడుతున్నారు.

Jilebi review: జిలేబి రివ్యూ

ఎందుకంటే నందమూరి బాలకృష్ణ కెరీర్ లో దారుణంగా డిజాస్టర్ లుగా భావించే సినిమాలను రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకోవడమే. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగానే బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, లయన్ సినిమాలు రీ రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నిజానికి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి, ఇప్పుడు టీవీల్లో వస్తేనే ఈ సినిమాలను చూడడానికి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇష్టపడరు. అలాంటిది ఈ బోరింగ్ మూవీస్ ను మళ్ళీ థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అని బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.

బాలకృష్ణ నటించిన లెజెండ్, సింహా, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలు ఉండగా ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడమేంటని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈమధ్య రీ రిలీజ్ అవుతున్న సినిమాల కలెక్షన్స్ విషయంలో కూడా అభిమానుల మధ్య పోటీ ఏర్పడుతోంది. మా హీరో రి రిలీజ్ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టేసి పొరపాటున టీవీల్లో వచ్చిన లేక ఓటీటీలో కూడా చూడటానికి ఆసక్తి చూపించని సినిమాలు రిలీజ్ చేయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలను కూడా సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ విషయం మీద ఆ రీ రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు తెలియాలి. నిజానికి ప్రస్తుతం బాలకృష్ణ… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోందాగి ఇక బాలకృష్ణ కూతురి పాత్రలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments