Balakrishna Bonding with Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం అలాగే ఆ తర్వాత చంద్రబాబుని అయిన ఆలింగనం చేసుకోవడం, తన సోదరుడు చిరంజీవి కాళ్ళ మీద పడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ ఒక పక్క పవర్ స్టార్ మరో పక్కన మెగాస్టార్ ఇద్దరు చేతులు పట్టుకొని పైకి లేపి ప్రజలకు అభివాదం చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Nara Brahmani – Ram Charan: చరణ్ తో నారా బ్రాహ్మణి వీడియో వైరల్!!
ఇది కాకుండా నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి వేదిక మీదకు వచ్చిన వెంటనే ఆమె సోదరుడు నందమూరి బాలకృష్ణ ఆమె దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా తల నిమిరి ఆమె నుదుటిమీద ముద్దాడిన వీడియో సైతం మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నందమూరి అభిమానులందరూ ఇది కదా బాండింగ్ అంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా 2024 ఎన్నికల్లో నారా భువనేశ్వరి సైతం కొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పాల్గొనడం హాట్ టాపిక్ అవుతోంది.