NTV Telugu Site icon

Balakrishna: దటీజ్ బాలయ్య.. జగపతిబాబు కోసం వెంటనే ఒప్పేసుకున్నాడట!

Balakrishna Chief Guest For

Balakrishna Chief Guest For

Balakrishna as Chief guest to Rudrangi movie Pre Release event: నందమూరి బాలకృష్ణను సాయం కోరితే కాదంటారా? సమస్యే లేదు, అది తన పరిధిలోని విషయం కాకపోయినా ఎలాగోలా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఇప్పుడు జగపతి బాబు కోసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూ సిద్దమయ్యారు ఆయన. రేపు బాలయ్య చీఫ్ గెస్ట్ గా రుద్రంగి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది, జగపతిబాబు బాలయ్యను ఆహ్వానించడంతో వెంటనే ఒప్పుకున్న బాలయ్య తాను వస్తానని మాట ఇచ్చాడట. జగపతిబాబు, విమలా రామన్‌, మమతా మోహన్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘రుద్రంగి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌నే క్రియేట్‌ చేయగా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు.

Movies Releasing This Week: నిఖిల్ ‘స్పై’తో పాటు ఐదు సినిమాలు.. రెండు రీ రిలీజులు!

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. భీమ్ రావు అనే దొర పాత్రలో జగపతిబాబు కనిపించ బోతుండగా అజయ్ సామ్రాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్‌ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కాలకేయ ప్రభాకర్‌, ఆశిష్‌ గాంధీ, ఆశిష్‌ నందా, దివి వైద్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జులై 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇక దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ ఈ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది మమతా మోహన్‌దాస్‌. నటిగా, గాయనిగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న మమతా క్యాన్సర్ బారిన పడిన తరువాత టాలీవుడ్‌లో సినిమాలు చేయట్లేదు. కాగా మళ్లీ ఇన్నేళ్లకు ‘రుద్రంగి’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Show comments