Site icon NTV Telugu

యాదాద్రిలో బాలయ్య… కేసీఆర్ పై ప్రశంసలు

Balakrishna

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై 25 రోజులైనా, తరువాత మరో రెండు భారీ చిత్రాలు విడుదలైనా ‘అఖండ’ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన ‘అఖండ’ టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. అంతేకాదు ఆయన యాదాద్రి విషయమై సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

https://ntvtelugu.com/175-theatres-closed-in-andhrapradesh/

ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన బాలకృష్ణ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి. ఇక్కడ పరిసరాలను కలుషితం చేయకుండా చేయాలి. – అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రలను దర్శించుకున్నాం. అందులో భాగంగానే యాదాద్రి దర్శనానికి వచ్చాము. యాదాద్రి ఒక అద్భుతం హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉంది” అంటూ ముఖ్యమంత్రిని ప్రశంసించారు.

Exit mobile version