NTV Telugu Site icon

Balagam Mogilaiah: ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట పాడి ఏడిపించిన మొగిలయ్య కి తీవ్ర అస్వస్థత

Balagam

Balagam

Balagam Mogilaiah: నటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా వేణు యేల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బలగం. దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకుంది. కుటుంబాల మధ్య ఉన్న బంధాలను అనుబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించి వేణు ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా బలగం క్లైమాక్స్ లో పాడిన పాట అందరి గుండెలను పిండేసిందంటే అతిశయోక్తి కాదు. ఒక తండ్రి ఆత్మ.. బిడ్డలు కలిసి ఉండాలని ఎంత తాపత్రయపడుతుందో ఆ సాంగ్ లో చూపించారు. ఇక ఈ పాట పాడిన దంపతులు మొగిలియ్య, కొమురమ్మ లకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత నుంచి మొగిలయ్య పేరు బలగం మొగిలియ్యగా మారిపోయింది.

Renu Desai: “ఆ పిచ్చి ఫ్యాన్స్ నోళ్లు మూయించు.. పవన్”

ఇక ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకున్న మొగిలయ్య తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడని, తన భర్తను ప్రభుత్వమే ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపింది. ” నా బర్త్ మొగిలయ్యకు అంతకు ముందు కిడ్నీ సమస్య ఉంది. ఇప్పుడు గుండె సమస్య వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. దయచేసి.. నా భర్తను కాపాడండి. ప్రభుత్వానికి, పెద్దలకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ఇక్కడ డాక్టర్లు ప్రస్తుతానికి చూసుకుంటున్నారు. నా భర్త కోలుకోవడానికి సహాయం చేయండి” అంటూ కంటనీరు పెడుతూ వీడియోలో మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్న కళాకారులకు ప్రభుత్వం సాయం చేయాలని అభిమానులు కోరుతున్నారు.