Crow: నమ్మకాలు.. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా వాటిని మాత్రం వదిలిపెట్టరు. ఎంత పైకి చదువుకున్నట్లు, నమ్మకాలను నమ్మునట్లు కనిపించినా.. కొన్ని సమయాల్లో మాత్రం వాటిని నమ్మక తప్పదు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ నమ్మకాలే సినిమాలకు ఆయుధాలు. ఏంటి అర్ధం కాలేదా.. సరే డిటైల్డ్ గా మాట్లాడుకుందాం. టాలీవుడ్ లో ఈ మధ్య విలేజ్ కథలు, విలేజ్ లో ఉన్న నమ్మకాలు అనే కాన్సెప్ట్ తో ఉన్న కథలే ఎక్కువ వస్తున్నాయి. ప్రేక్షకులు సైతం అది సినిమానే గా అని వెళ్తున్నారు. కానీ, ఆ సినిమా చూసాకా.. అరెరే ఇది నిజమే కదా.. మా తాతల కాలంలో ఇలాగే అనేవారు.. అలాగే ఉండేవారు అని చెప్పుకొస్తున్నారు. అందుకే ఆ నమ్మకాలను దర్శకులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కాకి గోల ఎక్కువ అయిపొయింది. కాకి అనగానే అర్దమైపోయి ఉంటుంది కదా .. మనం ఏ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నామో.. ఒకప్పుడు చిరుత, పులి, బ్లాక్ ఫాంథర్ లాంటి జంతువులను చూపించేవారు. అవి ఉంటేసినిమాలు హిట్ అని టాక్ వచ్చేవి. ఇక ఇప్పుడు వాటిని రీప్లేస్ చేస్తూ అందులోకి కాకి వచ్చింది.
Animal: ఇదేందయ్యా.. ఇది.. సినిమా చూడాలంటే వారి పర్మిషన్ కావాలా..?
సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు.. వారికి పిండం పెట్టినప్పుడు.. కాకులు వచ్చి తిని వెళ్తే.. చనిపోయినవారి ఆత్మలే.. కాకిలోకి దూరి వచ్చి పిండాన్ని తింటాయని పెద్దలు చెప్తుంటారు. అదే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే బలగం. ఇందులో కాకిదే ముఖ్య పాత్ర. తాత చనిపోయాక పెట్టిన పిండాన్ని కాకి ముట్టడి. కాకి పిండాన్ని ఎందుకు తినలేదు.. దానిచేత తినిపించాలంటే ఏం చేయాలి అనే పాయింట్ కు బంధాలు, బాంధవ్యాలకు ముడిపెట్టి వేణు మంచి కథను తీశాడు. అది సూపర్ హిట్. ఇక నాని నటించిన దసరా సినిమాలో కూడా కాకి ఒక సీన్ లో గట్టిగానే ప్రభావితం చేసింది. తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని తెలియకుండా తాను పెళ్లి చేసుకున్నాను అనే బాధతోనే చనిపోతాడు సూరి. ఆ సమాధి దగ్గర పెట్టిన అన్నాన్ని కాకి ముట్టుకోదు. ఎప్పడైతే ధరణి, వెన్నెల మెడలో తాళి కడతాడా.. వెంటనే కాకి అన్నం తిన్నట్లు చూపించారు. అంటే సూరి ఆత్మకు శాంతి కలిగిందని కాకి ద్వారా చూపించారు. ఇక ఇప్పుడు విరూపాక్ష వంతు. ఈ సినిమాలో తేజ్ ఎంత హీరోనో.. కాకి కూడా అంతే హీరో. కాకి ద్వారానే బ్లాక్ మ్యాజిక్ చేస్తూ విలన్ ప్రతీకారం తీర్చుకునే విధంగా సినిమాను కార్తీక్ దండు మలిచాడు. ఈ మూడు సినిమాల్లో కాకినే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక దెఇంతొ కాకి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. కాకి అంటే ఏదో ఒక పక్షి అనుకొనే నేటితరం యువత .. ఈ సినిమాలు చూసాకా కాకి ఒక పెద్ద హీరో అని పోల్చేసుకుంటున్నారు. మార్కెట్ లోకి కొత్త హీరో వచ్చాడ్రోయ్.. అంటూ మీమ్స్ వేసి ముచ్చటపడుతున్నారు.