NTV Telugu Site icon

Balagam Actor Died: తీవ్ర విషాదం.. బలగం నటుడు కన్నుమూత

Balagam Narsingam Died

Balagam Narsingam Died

Balagam Actor Narsingam Died: చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది బలగం సినిమా. అప్పటివరకు కమెడియన్గా అందరినీ అలరించిన వేణు ఒక్కసారిగా ఈ సినిమా డైరెక్ట్ చేసి ప్రేక్షకులందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలోని పిట్ట ముట్టుడు సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో నటించిన ఒక వ్యక్తి చనిపోయినట్లుగా సినిమా దర్శకుడు వేణు ఎల్దండి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Bigg Boss Telugu 7: ఈ బిగ్ బాస్ వాయిస్ ఏందయ్యా ఇంత కామెడీగా ఉంది?

ఈ సినిమాలో ఊరికి సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం కన్నుమూసినట్లుగా ఆయన వెల్లడించారు. ‘’నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏, మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏, బలగం కథ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను, ఆరోజు కల్లు, గుడాలు తెప్పించాడు నా కోసం..🙏 అని వేణు ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సైతం ఈ సందర్భంగా వేణు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి నిర్మించారు. సుధాకర్ రెడ్డి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో దాదాపుగా ఆ షూటింగ్ జరిపిన ఊరి వారినే నటింప చేశారు. ఈ క్రమంలోనే నర్సింగంను కూడా నటింప చేసినట్టు తెలుస్తోంది.