తమిళ కథానాయకుడు సూర్య, బాలా కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నంద’. ఆ సినిమా నటుడిగా సూర్యకు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో ‘పితామగన్’ సినిమా రూపుదిద్దుకుంది. ఇది తెలుగులో ‘శివపుత్రుడు’గా డబ్ అయ్యింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు బాలా పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మూవీ పేరు ఖరారు చేశారు. తమిళంలో ‘వనన్ గాన్’ అనే పెట్టగా, తెలుగులో ‘అచలుడు’ అని పెట్టారు. కృతీశెట్టి నాయకగా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య, జ్యోతిక నిర్మించగా, సాయిపల్లవి టైటిల్ రోల్ ప్లే చేసిన ‘గార్గి’ చిత్రం ఈ నెల 15న జనం ముందుకు వస్తోంది. ఇదే సమయంలో వీరు నిర్మిస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం పేరు ఖరారు కావడం విశేషం. హీరో సూర్యకు ఇది 41వచిత్రం.
Bala: ‘అచలుడు’గా సూర్య!

Achaludu First Look