Site icon NTV Telugu

Bollywood : బజ్జి బయోపిక్.. హీరో ఎవరంటే.?

Bajji

Bajji

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. తన స్పిన్ బౌలింగ్‌తో పాటు, కీలక సమయాల్లో బ్యాటింగ్‌తోనూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ‘టర్బనేటర్’గా పిలువబడే హర్భజన్ క్రికెట్ కెరియర్ సినిమాటిక్ గా ఉంటుందని దాన్ని వెండితెరపై చూపిస్తే వర్కవుట్ అవుతుందని కొందరి ఒపీనియన్.

Also Read  Bhagyashri Borse : సాహసం శ్వాసగా సాగిపో

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ తన జీవిత కథ సినిమాగా వస్తే చూడాలని ఉందన్నాడు. అంతేకాకుండా తన రోల్ కు పాత్రకు న్యాయం చేయాలని భావిస్తున్న ఇద్దరు హీరోల పేర్లను వెల్లడించాడు.అందుల్లో ఒకరు విక్కీ కౌశల్ మరొకరు రణవీర్ సింగ్‌. తన పాత్రకు వీరైతేనే బాగుంటుందని చెబుతున్నాడు. ఇప్పటికే కపిల్ బయోపిక్ 83లో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా కనిపించాడు.బహుశా ఇదే రన్వీర్ తన పాత్ర కూడా చేస్తే బాగుంటుందని భజ్జీ భావిస్తున్నాడేమో. గతంలో రణవీర్ సింగ్ ’83’ చిత్రంలో కపిల్ దేవ్‌ పాత్రలో ఒదిగిపోయి, ఆ పాత్రను ఎంత అద్భుతంగా పోషించగలడో నిరూపించుకున్నాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా, రణవీర్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. మరోవైపు, విక్కీ కౌశల్ ‘ఛావా’ చిత్రంలో తన పాత్రలో సీరియస్ నెస్ ను చూపించాడు.బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసాడు. హర్భజన్ సింగ్ బయోపిక్‌లో తన పాత్రను ఎవరు పోషిస్తారో, ఆ చిత్రం ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి. విక్కీ కౌశల్ తన ఇంటెన్సిటీతో కాని రణవీర్ సింగ్ తన ఎనర్జీతో భజ్జీ పాత్రలో మెప్పిస్తారో లేరో చూడాలి.

Exit mobile version