Site icon NTV Telugu

Baby : తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టిన వైష్ణవి

Whatsapp Image 2023 07 14 At 12.51.32 Pm

Whatsapp Image 2023 07 14 At 12.51.32 Pm

హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. సినిమాలో వైష్ణవి చైతన్య తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. సినిమాలో ఈ అమ్మడి పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.. హీరోయిన్ గా తను కాకుండా మరొకరు నటించి ఉంటే ఈ సినిమా అంతగా ఆకట్టుకునేది కాదు ఏమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు..వైష్ణవి చైతన్య బేబి సినిమాలో అదరగొట్టారనే చెప్పాలి. ట్రెడిషనల్ రోల్ లో నటించిన ఈ బ్యూటీ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో మెప్పించింది.ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ అశ్విన్ కూడా బాగా కూడా బాగా నటించారు. కానీ వారిని మించి వైష్ణవి  నటించిందని  చెప్పవచ్చు.. బేబీ సినిమా కమర్షియల్ గా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.తెలిసిన కథనే కొత్తగా చూపించారు దర్శకులు సాయి రాజేష్.. నేటి తరం వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది..

ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ కు మంచి విజయం దక్కుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అవుతుందని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. బేబీ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తన కెరీర్ కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందని చెప్పవచ్చు.ఈ సినిమాలో నటించిన మరో నటుడు విరాజ్ అశ్విన్ కూడా బాగా నటించాడు. ఈ సినిమా తరువాత తనకు వరుస ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది..ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రేక్షకులలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ రన్ లో ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి

Exit mobile version