NTV Telugu Site icon

Viraj Ashwin: విరాజ్ అశ్విన్‌ కి లక్కీ ‘బేబీ’!

Viraj Shwin

Viraj Shwin

Baby Movie is turning point for Viraj Ashwin: సినీ పరిశ్రమలో మనవాళ్లు ఉన్నారంటే పని ఈజీ అయిపోతుంది, మనం కూడా ఎలాగొలా అక్కడ దున్నేయచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనవాళ్లు అక్కడ ఉన్నా, టాలెంట్ మనకి ఉన్నా టైం రావాలి. అందుకే చాలామంది వారసులు ఇప్పటికే సినీ రంగప్రవేశం చేసినా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేక పోతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే హీరోగా లాంచ్ అయిన ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ ఈసారి సాలిడ్ హిట్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. నిజానికి విరాజ్ అశ్విన్ అనగనగా ఓ ప్రేమ కథతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలా మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన విరాజ్‌కు థ్యాంక్యూ బ్రదర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు కూడా లభించింది. అనసూయ ప్రధాన పాత్రలో నటించగా డైరెక్ట్ ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఇక 2020లో విరాజ్ చేసిన షార్ట్ ఫిల్మ్ “మనసనమహ” ఓ సెన్సేషన్, ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్ (513 అవార్డులు)గా గిన్నిస్ రికార్డు కూడా సాధించింది. ఇక విరాజ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో కలిసి బేబీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ లేనపుడు దేశం ఆగిపోలేదు.. జనసేనాని కామెంట్స్

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ ఈ నెల 14న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్‌కి అనూహ్య స్పందన రాగా తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేసింది. ఇక ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే బేబీ సినిమాలో విరాజ్‌ అశ్విన్ పాత్ర చాలా కీలకమైనదని ఇట్టే అర్ధం అవుతోంది. ట్రైలర్‌లో లవర్ బాయ్ తరహా పాత్రలో వీర మెప్పించగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది. ఇక విరాజ్ కెరీర్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఆయనకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చేసిన సినిమాల కంటే ఈ సినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్, అంచనాలు ఏర్పరచుకుంది. ఇక ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయితే ఆయన మరిన్ని సినిమా అవకాశాలు రావడం ఖాయం. నిజానికి విరాజ్ ఈ మధ్యనే మాయపేటిక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రస్తుతం బేబీతో పాటు మరో మూడు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి అంటే లైనప్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.