Site icon NTV Telugu

Baby: ‘బేబీ’కి మెగా ప్రశంసలు.. కన్నీళ్లు ఆగడంలేదట!

Mega Applause To Baby Movie

Mega Applause To Baby Movie

Baby movie gets Megastar chiranjeevi’s Applause : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన తాజా మూవీ బేబీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు కూడా రాబడుతోంది. ఇక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా యూత్‏ను ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్లకు కనెక్ట్ అవుతుండడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలై 14 రోజులు అవుతున్నా ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ సినిమాపై సామాన్యులే కాకుండా.. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు.

Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్‌పై పాలాభిషేకం చేసి చింపారు!

ఈరోజు డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ చిరంజీవిని ఆయన నివాసంలో మీట్ అవ్వగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కల నిజమైంది, నా దేవుడితో 2 గంటలు గడిపాడు, ఆయన బేబీ సినిమాను ఎంతో ఇష్టపడ్డారు, ప్రతి క్రాఫ్ట్‌ని మెచ్చుకున్నారని, ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అంటూనే 2 గంటలు బాబాయ్….2 గంటలు….. అట్లా గడిచిపోయాయి, బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు ఆగలేదు అని చెబుతూనే మెగా ఈవెంట్‌ ఒకటి లోడ్ అవుతోంది అని చెప్పుకొచ్చారు. అమ్మకు బిడ్డ ఆకలి తెలియదా, బాస్ కి ఫ్యాన్స్ మనసు తెలియదా, అందుకే ఆయన గుండెల్లో నిలిచిపోతారు, బేబీ సినిమా గురించి ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ వస్తోంది, థాంక్ యూ మెగాస్టార్ అంటూ ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు.

Exit mobile version