Baby Movie: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. SKN నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ప్రతి లవ్ బ్రేకప్ కుర్రాడికి ఈసినిమా బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా వైష్ణవి చైతన్య కు ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా బేబీ గురించే చర్చ జరుగుతోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆనంద్ పిచ్చివాడు కావడం.. వైష్ణవి మరో పెళ్లి చేసుకొని వెళ్లిపోవడం తో కథ ముగుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. అయితే ఈ సినిమాకు మొదట ఈ క్లైమాక్స్ అనుకోలేదట.
Janhvi Kapoor: దేవర బ్యూటీ.. భలే ఇరుక్కుపోయిందే
సాధారణంగా ఒక సినిమాకు ప్రతి డైరెక్టర్ రెండు, మూడు క్లైమాక్స్ లు అనుకుంటారు. ఈ సినిమాకు కూడా సాయి రాజేష్ రెండు క్లైమాక్స్ లు అనుకున్నాడట. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తుంది అయితే.. ఇంకొకటి విషాదకరంగా ముగించాలి అనుకున్నారట. అంటే.. చివరిలో ఆనంద్ పాత్రను కానీ, వైష్ణవి పాత్రను కానీ చంపేయాలనుకున్నారట. కానీ, అలా చేస్తే చాలా సినిమాలు అలానే ఉన్నాయి కాబట్టి రెండో క్లైమాక్స్ ను పెట్టారట. నిజం చెప్పాలంటే.. ఈ క్లైమాక్స్ కొంచెం కొత్తగా ఉంది. ఒకవేళ ఆనంద్ పాత్ర పిచ్చివాడిని చేసి వదిలేసి.. వైష్ణవి పెళ్లిని చూపించకపోతే.. ప్రేమిస్తే సినిమాతో పోల్చేవారు. ఇక ఆనంద్ పాత్ర ను చంపేస్తే ఆర్ఎక్స్ 100 సినిమాతో పోల్చేవారు. అందుకే ఈ రెండు కాకుండా కొత్తగా ఉండడానికి అల్లు అరవింద్ ఈ క్లైమాక్స్ ను సజిస్ట్ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఆ క్లైమాక్స్ కనుక పెట్టి ఉంటే ఇంత హిట్ అయ్యేది కాదేమో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
