Site icon NTV Telugu

Baby: ‘బేబీ’నా మజాకా.. 11 రోజుల్లో అర్జున్ రెడ్డి కలెక్షన్స్ బ్రేక్ చేసిందిగా!

Baby Crosses Arjun Reddy Collections

Baby Crosses Arjun Reddy Collections

Baby crosses Arjun Reddy Collections: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా బేబీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. వర్షం ఒక పక్క దుమ్ము రేపుతున్నాదానితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం కొనసాగిస్తోంది. మొదటి వారం రోజులలో ఈ సినిమా అద్భుతమైన బుకింగ్స్‌తో సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా దాదాపు 11 రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనాత్మక విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డి లైఫ్‌టైమ్ కలెక్షన్స్ క్రాస్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బేబీ తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Vishwak Sen: చాలా బాధగా ఉంది.. వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలి!

మొన్న శుక్రవారం నాడు కొత్త సినిమాలు రిలీజ్ అయినా సరే ఈ సినిమానే ప్రేక్షకులకు క్లియర్ ఆప్షన్ గా మారింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కలెక్షన్స్ మాత్రమే కాదు, అగ్ర నిర్మాతలు, నటీనటులు అలాగే క్రిటిక్స్ నుండి కూడా ఈ సినిమా ప్రశంసలను అందుకుంటుంది.. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి పెద్ద హిట్ అయింది. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై డైరెక్టర్ మారుతి, ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక మొత్తం మీద అన్న అర్జున్ రెడ్డి సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ను బేబీ మూవీ 11 రోజుల్లోనే క్రాస్ చేయడంతో ఆనంద్ దేవరకొండ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నటీనటులకు ఇతర సినిమా అవకాశాలు కూడా లభిస్తున్నాయి.

Exit mobile version