Babu Mohan: టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్న నటులు.. బ్రహ్మానందం, కొత్త శ్రీనివాసరావు, బాబు మోహన్. వయస్సు పెరుగుతున్నా.. వీరి నటనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో వీరు లేని సినిమా ఉండేది కాదు. కొంతమంది దర్శకనిర్మాతలు.. హీరోల డేట్స్ కన్నా కమెడియన్స్ డేట్స్ కోసమే క్యూ కట్టేవారట. ముఖ్యంగా కోటా, బాబు మోహన్ కాంబో అంటే పెదాల మీద నవ్వు అలవోకగా వచ్చేస్తుంది. అంతలా వారి కాంబో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇద్దరు సినిమాల్లో ఎంతలా అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నారో.. ఇద్దరి జీవితాల్లోనూ అంతే విషాదాలు ఉన్నాయి. ఇక రాజకీయాల్లో కూడా వీరు ఇద్దరు విజయాలను అందుకున్నవారే. ప్రస్తుతం ఇద్దరు కూడా ఛాన్స్ వచ్చినప్పుడల్లా.. సినిమాల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నవారే. బాబు మోహన్ .. డ్రామా జూనియర్స్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తుండగా.. కోటా.. వయస్సు మీదపడుతుండడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇక గతంలో బాబు మోహన్.. కోటా గురించి, బ్రహ్మానందం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
#War2 రిలీజ్ డేట్ ఫిక్స్..మాస్ హీరోలు రచ్చ చేసేది ఆరోజే!
“కోటా అన్నకు అసూయ ఎక్కువ. ఎవరైనా తనకన్నా ఎక్కువ ఉంటే తట్టుకోలేడు. నేను మంత్రి అయ్యాక .. న వెనుక ఇద్దరు గన్ మెన్ లు వచ్చేవారు.. ఆసమయంలో అడపాదడపా షూటింగ్ చేసేవాడిని. షూటింగ్ లో కూడా గన్ మేన్స్ వచ్చేవారు. ఇక వారిని చూసి అన్న.. ఏరా.. గన్ మెన్ లా అంటూ పెదవి విరిచేవాడు. ఆయన మనసులో ఏం పడ్డది అంటే.. రాజకీయాల్లోకి వెళితే .. తనకు కూడా గన్ మెన్ లు ఉంటారని.. రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తరువాత నా దగ్గరకు వచ్చి నాకు గన్ మెన్స్ ఉన్నారని చెప్పాడు. ఇక నేనెప్పుడూ అసెంబ్లీ మానేవాడిని కాదు. రోజు వెళ్లి వాళ్ళు చెప్పేది వినేవాడిని. కోటా అన్న ఎక్కడో ఒక మూల కూర్చునేవాడు.. నేను నా ప్లేస్ లో కూర్చొనేవాడిని. అసెంబ్లీకి రావడం ఆలస్యం.. రారా .. నాపక్కన కూర్చో అనేవాడు. లేదన్నా.. నాకు అక్కడ ప్లేస్ ఉంది అంటే .. ఏరా నా పక్కన కూర్చోకూడదా.. ? మనం ఉన్నన్నిరోజులు ఒకే దగ్గర కూర్చుందాం అని చెప్పాడు. ఇక రోజు నేను కూడా అక్కడే కూర్చొనేవాడిని. ఆ తరువాత నేను క్యాబినెట్ మంత్రిని అయ్యాను. అసెంబీలో మొదటి వరుసలో కూర్చోవాలి. ఆరోజు కోటా అన్న పిలిస్తే నేను.. ఇదే విషయం చెప్పాను. నువ్వు ఎమ్మెల్యే .. నేను క్యాబినెట్ మంత్రి.. అక్కడే కూర్చోవాలి అంటే.. ఎందుకురా మంత్రి పదవి.. మనం ఎమ్మెల్యేలుగా ఉంటే ఎంత బావుంటుందిరా అనేవాడు. లేదన్నా.. అక్కడ క్యాబినెట్ మంత్రి అని నేను వెళ్లి నా సీట్ లో కూర్చునేవాడిని. ఇక అర్రే నేను బీజేపీ.. మంత్రి కాలేను అని కుళ్ళుకోని.. తరువాతి రోజు నుంచి ఆయన అసెంబ్లీకి రాలేదు. కేవలం నాకు గన్ మెన్ లు ఉన్నారు.. ఆయనకు లేరు అని.. వారికోసం రాజకీయాల్లోకి వచ్చాడు” అని చెప్పుకొచ్చాడు.
Chiranjeevi: అది చిరంజీవి సంస్కారం.. ఆయనను దేవుడిగా పూజిస్తూ
ఇక బ్రహ్మానందం గురించి బాబు మోహన్ మాట్లాడుతూ.. ” బ్రహ్మానందం కనపడని కత్తి. ఎక్కడ కోశాడు.. ఎలా కోశాడు అనేది తెలియదు.. రక్తం రావడం మాత్రమే తెలుస్తుంది. బ్రహ్మానందం మీద తనికెళ్ల భరణి ఒక పద్యం రాశాడు. ఎక్కడ చెక్కాలో.. ఎక్కడ నొక్కాలో తెలిసిన మేధావి, నేర్పరి అని పద్యం రాశాడు. ఆహా.. ఎక్కడ చెక్కాలో.. ఎక్కడ నొక్కాలో అని బాగానే రాశావ్ రా అని మేము సెటైర్లు వేసుకొనేవాళ్ళం. ఎక్కడ చెక్కాలో.. ఎక్కడ నొక్కాలో తెలిసిన మేధావి.. కనుక దొరికేది కాదు.. కానీ, కోటా..ఉత్త ఎడ్డీ గొడ్డు.. మాకు ఉన్నారయ్యా గన్ మెన్ లు అని చెప్పుకుంటూ తిరగడమే” అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు పాతవే అయినా మరోసారి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.
