BAAK Raashi Khanna – Vennele Kishore First Looks Released: తమిళంలో అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నాల్గవ వెర్షన్ ను మరింత బిగ్గర్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ‘బాక్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మేకర్స్ నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా సుందర్ సి, తమన్నా భాటియా పాత్రలను పరిచయం చేయగా ఈరోజు రాశీఖన్నా, వెన్నెల కిషోర్‌ల ఫస్ట్‌లుక్ పోస్టర్‌లను విడుదల చేశారు.
Devara : దేవర లెక్క 1000 కోట్ల నుంచే.. ఇదిగో ప్రూఫ్!
ఇక రెండు పోస్టర్లలో హాంటెడ్ హౌస్ నేపథ్యంలో భయానకంగా కనిపిస్తోంది. రాశి ఖన్నా టెర్రిఫైడ్ గా కనిపించగా, వెన్నెల కిషోర్ కూడా టెన్షన్ పడతూ కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో విడుదల చేయనుంది. ఇక ఈ సినిమాకి హిప్హాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రలలో నటిస్తున్నారు.