War 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాట్లాడారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ గొప్ప యాక్టర్లు. వారిని హ్యాండిల్ చేయడానికి చాలా టెన్షన్ పడ్డాను. ఈ సినిమా ఎవరు చెడ్డవారు కాదు. ఎందుకంటే ఇందులో ఇద్దరూ హీరోలే. ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్ అనేది మీరు సినిమా చూశాక తెలుస్తుంది. ఆన్సర్ మీకు దొరకదు. ఎందుకంటే ఇద్దరూ ఇందులో హీరోలే. ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్పగా నటించారో మీకు సినిమాలో కనిపిస్తుంది.
Read Also : War 2 Pre Release Event : ఇది హృతిక్-రామారావు నామ సంవత్సరం : త్రివిక్రమ్
వారిద్దరితో సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. వాటిని మీకు థియేటర్ లోనే చూపిస్తాం. ట్రైలర్ లో దాచిపెట్టాం. అసలు కథ, సోల్ వేరే ఉంది. ఇది అద్భుతమైన సినిమా అవుతుందనే నమ్మకం నాకుంది. ఇద్దరు గొప్ప నటులను ఇందులో మీకు చూపించబోతున్నాం. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సౌత్ లోకి నేను రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఎన్టీఆర్ వల్లే ఇది జరిగింది. ఆయన అభిమానులకు స్పెషల్ థాంక్స్. మీరు థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ తెలిపాడు అయాన్ ముఖర్జీ.
Read Also : War 2 Pre Release Event : నన్ను ఎవ్వరూ ఆపలేరు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్
