Ayalaan Telugu Official Trailer: సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్ లో నిలబెట్టగా హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా జనవరి 12న దిగుతోంది. దీపావళి పండగలో నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ అయితే కూల్ గా నేచురల్ విజువల్స్ తో మొదలైంది. ఈ భూమి అన్ని జీవరాశులకు సొంతం అని నాన్న చెప్పిన మాటలను నేను నమ్ముతాను అంటూ శివ కార్తీకేయన్ చెప్పడంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అద్భుతమైన విజువల్స్ చూపిస్తూ.. సాగిస్తుండగా.. సడెన్ గా ఒక ఏలియన్ దిగుతుంది.
Eagle: ఈగల్ కి పోటీ తప్పట్లేదు!
శివ కార్తీకేయన్ లైఫ్ లోకి ఏలియన్ వచ్చాక ఆయన లైఫ్ ఎలా మారింది? ఏలియన్ తో కలిసి శివకార్తికేయన్ చేసిన సందడి అంతా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఏలియన్ చేసే కామెడీ చేష్టలు ఆకట్టుకుంటున్నాయి. మామూలుగా అమెరికాను అంతం చేయడానికే కదా వెళ్తారు.. ఇప్పుడు మా దేశానికి వచ్చారేంట్రా అంటూ శివకార్తికేయన్ ఏలియన్ ను అడిగే డైలాగ్ ఆకట్టుకుంటుంది. విలన్ సృష్టించే విధ్వంసాన్ని… ఏలియన్ తో కలిసి హీరో ఎలా అరికట్టాడు అనేది కథాంశం అని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఏలియన్ కు తోడుగా నిలిచిన హీరో… ఏం చేశాడు.. అనేది తెలియాలంటే.. సినిమా చూడాలి. కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ తో కూడిన ఎంటర్ టైనర్ లా అనిపిస్తోన్న ఈ ట్రైలర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.