Umapathi: ‘ఉమాపతి ’ సెన్సార్ పూర్తి.. డిసెంబర్ 29న విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avika Gor’s Umapathi Censor Completed: ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్నారు, అయితే ఈ రోజుల్లో మాత్రం గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మించగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకోగా రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
Salaar Child Artist: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది రవితేజ కొడుకా.. అసలు విషయం ఇదే!
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారని మేకర్స్ వెల్లడించారు. పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ అందమైన ప్రేమ కథా సినిమా అని కొనియాడారని, అనంతరం సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారని అన్నారు. డిసెంబర్ 29న థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్న ఈ సినిమాకి శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేసిన ఈ సినిమాకి చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేశారు. ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!