Avika Gor: ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం హీరోయిన్స్ కు అలవాటుగా మారిపోయింది. ఇక్కడ సినిమాలు చేసి, మంచి విజయాలను అందుకొని, వేరే ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేసి విమర్శలకు గురవుతున్నారు. తాజాగా హీరోయిన్ అవికా గోర్ సైతం సౌత్ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాలనటిగానే అందరిని ఆకర్షించింది అవికా గోర్. ఇక ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయామైంది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే అవికా మంచి పేరునే అందుకుంది. ఇక వరుస సినిమాలతో మంచి అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆశించిన విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో అమ్మడికి అవకాశాలు కూడా తగ్గాయి. ఇక బాలీవుడ్ లోనే సెట్ అయిన ఈ భామ వెబ్ సిరీస్ లు చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. ఇక తాజాగా ఈ భామ సౌత్ ఇండస్ట్రీపై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
Manchu Manoj: ఆదిపురుష్ కోసం మేము కూడా అంటున్న నవదంపతులు
“సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ. సౌత్ లో స్టార్స్ పవర్ మీదనే ఇండస్ట్రీ నడుస్తోంది. అక్కడ స్టార్స్ సినిమాలనే చూస్తారు. బాలీవుడ్ లో ఎక్కువ వివక్షత ఉండదు. ఇంకా చెప్పాలంటే.. బాలీవుడ్ లో కన్నా సౌత్ ఇండస్ట్రీలోనే నెపోటిజం ఎక్కువ. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ చూపిస్తారు. బాలీవుడ్ లో తెలుగు సినిమాల రీమేక్స్ ను ఎక్కువ ఇష్టపడతారు. కానీ, తెలుగులో హిందీ సినిమాలను అస్సలు చూడరు” అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో మంచి సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకొని ఇలా సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం పద్దతి కాదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇంటర్వ్యూలో హైలైట్ అవ్వాలని, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాలని నోటికి ఏది వస్తే అది మాట్లాడకు.. సౌత్ ఇండస్ట్రీ ప్రతి సినిమాను ఆహ్వానిస్తోంది. కథ నచ్చితేనే అభిమానులు థియేటర్ కు వెళ్తున్నారు. ఇవేమి తెలియకుండా మాట్లాడుతున్నావ్.. ఇలాంటి కామెంట్స్ చేస్తే తెలుగులో నువ్వు ఎక్కువ రోజులు కనిపించవు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.