చిన్నారి పెళ్లి కూతురు గా అభిమానుల హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించిన అవికా గోర్ వివాహబంధం లోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 30న, ఆమె తన ప్రియుడు మిళింద్ అద్వానీతో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవికా తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.. “బాలిక నుంచి వధువు వరకూ” అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read : Tere Ishk Mein : ధనుష్ ‘తేరే ఇష్క్ మే’ టీజర్ విడుదల..
అవికా వివాహం చేసుకున్న మిళింద్ చద్వానీ సామాజిక కార్యకర్త మరియు వ్యాపారవేత్త. ఆయన క్యాంప్ డైరీస్ పేరిట ఒక ఎన్జీవోను నెలకొల్పారు. అంతకు ముందు ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఇక తన టీవీ కేరియర్ ద్వారా అవికా ‘ఉయ్యాలా జంపాలా’ తో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించారు. తర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. లేటెస్ట్ మూవీ ‘షణ్ముఖ’ 2025 మార్చిలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది. ఇక అవికా, మిళింద్ మధ్య పరిచయం కొన్నాళ్ల క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏర్పడింది. తర్వాత ప్రేమ బంధం నుంచి పెద్దల అంగీకారంతో వారు వివాహం చేసుకున్నారు.
