Site icon NTV Telugu

మహేష్ బాటలో విజయ్ దేవరకొండ… థియేటర్ రెడీ

Vijay Devarakonda Ready to Launch his Multiplex

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో నడవడానికి సిద్ధమైపోయారు. ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన థియేటర్ నిర్మాణం పూర్తయ్యిందని తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ ఫుల్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే తన “రౌడీ” బ్రాండ్ తో బట్టలు అమ్ముతున్న విషయం తెలిసిందే. ఇంకా తన బిజినెస్ ను విస్తరించుకోవడానికి తెలివైన పెట్టుబడులు పెడుతున్నారు.

Read Also : చెప్పులేసుకుని ఫోటో దిగినందుకు నటి అరెస్ట్

ఈ స్టార్ హీరో ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహబూబ్‌ నగర్లో ఒక మల్టీప్లెక్స్‌ను ఆవిష్కరిస్తున్నారు. మల్టీప్లెక్స్ పేరు ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ (AVD సినిమాస్). మల్టీప్లెక్స్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మల్టిప్లెక్స్ కు సంబంధించితిన్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. AVD సినిమాస్ ఓపెనింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. AVD సినిమాస్ లో ఈ ఏడాది దసరా నుండి సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇక మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ వారితో కలిసి “ఏఎంబి” (ఏషియన్ మహేష్ బాబు) అనే మల్టిప్లెక్స్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ దేవరకొండ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో “లైగర్” అనే స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది.

Exit mobile version