Site icon NTV Telugu

Avatar & Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కి.. అవతార్ 3 భారీ షాక్

Avathar And Rahjasab

Avathar And Rahjasab

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటించిన హారర్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుండగా, జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ముఖ్యంగా యూఎస్‌లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తాజాగా ఓ విషయం వైరల్ అవుతుంది.. ఓవర్సీస్ మార్కెట్‌లో ‘ది రాజా సాబ్’కు హాలీవుడ్ భారీ చిత్రం ‘అవతార్ 3’ రూపంలో అనూహ్యమైన అడ్డంకి ఎదురైందట. సాధారణంగా ఇండియన్ ఫిల్మ్‌లు ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో షూట్ చేయకపోయినా, ఆ వెర్షన్‌ను అప్డేట్ చేసి విడుదల చేస్తుంటారు. అలా ప్రభాస్ గత చిత్రాలూ ఐమ్యాక్స్‌లో విడుదలయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి మారింది.

Also Read : Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే అవతార్ 3 కోసం 3–4 వారాల ఐమ్యాక్స్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవడంతో, ‘ది రాజా సాబ్’ను ఐమ్యాక్స్‌లో రిలీజ్ చేసే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయట. అందువల్ల రాజా సాబ్ ఐమ్యాక్స్ రిలీజ్‌పై అభిమానులు ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదని స్వయంగా డిస్ట్రిబ్యూషన్ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. అయినా కూడా యూఎస్ మార్కెట్‌లో PLF, DBOX వంటి ప్రీమియం ఫార్మాట్‌ల్లో సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో ఐమ్యాక్స్ లేకపోయినా.. ‘ది రాజా సాబ్’ను ఉత్తమమైన అనుభవాన్ని అందించే ఇతర ఫార్మాట్స్‌లో చూడగల అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.

Exit mobile version