జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్సాఫీసును షేక్ చేశాడు. ఆయన నుండి సినిమాలు వస్తున్నాయంటే ఇక్కడ ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా దుకాణం సర్దుకోవాల్సిందే.. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ వర్త్ ఫుల్ మూవీ అందించాడు. అవతార్ ద వే ఆఫ్ వాటర్ భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అవతార్ ఫ్రాంచైజీ నుండి టూ ఫిల్మ్స్ రాగా, ఇప్పుడు థర్డ్ మూవీ రాబోతుంది.
Also Read : HHVM : వీరమల్లు రిలీజ్ కు ముందే ఫ్యాన్స్ ఆకలి తీర్చిన పవర్ స్టార్
గత రెండు సినిమాల మాదిరి అవతార్ 3ని కూడా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. జేమ్స్ కెమెరాన్ ఈ సారి మునుపెన్నడి చూడని పండోరాను చూడబోతున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్నహాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం మార్వెల్ ‘ఫెంటాస్టిక్ ఫోర్’తో పాటు జత చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో రెండు సీక్వెల్స్ కూడా తెరకెక్కబోతున్నాయి. 2029లో, 2031లో ఆ టూ ఫిల్మ్స్ రాబోతున్నాయి. పంచ భూతాల కాన్సెప్టుతోనే జేమ్స్ కెమెరాన్ తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేల, నీరు, ఇప్పుడు నిప్పును తీసుకు వస్తున్నాడు. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న అవతార్ 3 క్రిస్మస్ బరిలో దిగితే డిసెంబర్ 15 తర్వాత రిజర్వ్ చేసుకున్న భారతీయ చిత్రాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సిందే.
