Avatar 3 Trailer : హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన విజువల్ వండర్ అవతార్ మూవీ ఓ సంచలనం. సినిమా ప్రపంచాన్ని శాసించిన సినిమా యూనివర్స్ ఇది. ఇందులో ఇప్పటికే రెండు పార్టులు వచ్చి ప్రపంచాన్ని మెప్పించాయి. ఇప్పుడు మూడో పార్టు కోసం అంతా రెడీ అవుతోంది. డిసెంబర్ 19న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా గత రెండు నెలల క్రితమే ఓ ట్రైలర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ట్రైలర్ ను వదిలారు. ఇది కూడా విజువల్ ఫీస్ అనిపిస్తోంది.
Read Also : OG : అప్పుడు హరీష్.. ఇప్పుడు సుజీత్.. అదే సెంటిమెంట్..
రెండో ట్రైలర్ లో నీటి ప్రపంచాన్ని హైలెట్ చేసిన జేమ్స్.. మూడో పార్టు అడవులను హైలెట్ చేస్తూ తీసినట్టు కనిపిస్తోంది. యాక్షన్ సీన్లు కట్టి పడేసేలా ఉన్నాయి. రెండు తెగల నడుమ జరిగిన యుద్ధాన్ని విజువల్ వండర్ లా తీర్చిదిద్దాడు. ఇందులో మానవ తెగ మరో అంశం. వీఎఫ్ ఎక్స్ అద్భుతంగా అనిపిస్తోంది. మరి ఈ మూడో పార్టు కూడా ప్రపంచాన్ని మెప్పిస్తుందా లేదా అనేది మరో మూడు నెలల్లో తెలిసిపోతుంది.
Read Also : Gouthami : ప్రూఫ్ చూపిస్తే రాళ్లతో కొట్టించుకుని చస్తా.. గౌతమి చౌదరి సవాల్..
