NTV Telugu Site icon

Avatar-2 : మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అవతార్.. విజువల్స్ అయితే దేవుడా

James

James

Avatar-2 : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సినీ ప్రేక్షకులను అలరించింది. ఇక దీనికి సీక్వెల్ ప్రకటించిన దగ్గరనుంచి అవతార్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 16 న రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయమని మేకర్స్ ను అభిమానులు అడుగుతున్నారు. ఇక అభిమానుల కోరిక మేరకు నేడు ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’పేరుతో వచ్చిన ఈ ట్రైలర్ ఒక విజువల్ వండర్ గా నిలిచింది.

అవతార్.. పాండారా గ్రహంలో జరిగిన కథ కాగా.. అవతార్ 2 ను సముద్ర గర్భంలో చూపించారు. అవతార్ లో జేక్ సల్లీ పాత్రలో సామ్ వర్డింగ్టన్ కనిపించాడు. ఇక అవతార్ 2 లో అతని కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశాడు కామెరూన్. ఇక సముద్రంలో వారు చేసిన విన్యాసాలు, ఎదుర్కున్న కష్టాలు.. ఒకరినొకరు ఆదుకోవడం ఇవన్నీ చూపించారు. ఈ చిత్రాన్ని లైట్ స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్ మరియు టీఎస్జీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. భారత్‌లో ఈ చిత్రం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments