NTV Telugu Site icon

Movies: ఈవారం సినిమాలకు ‘అవతార్2’ దెబ్బ!?

Avatar 2

Avatar 2

ఈ వారం ప్రేక్షకుల ముందుకు ‘భళా తందనాన, అశోకవనంలో అర్జునకళ్యాణం’, ‘జయమ్మ పంచాయితీ’, ‘వర్మ మా ఇష్టం’ సినిమాలు రానున్నాయి. అయితే వీటితో పాటు మార్వెల్ స్టూడియో వారి ‘డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మేడ్ నెస్’ కూడా పలు భాషల్లో వేలాది థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రీవ్యూను మే2వ తేదీ హాలీవుడ్ లో ప్రదర్శించారు. ఈ నెల 6వ తేదీన ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ‘అవతార్ 2’ ఫస్ట్ గ్లింప్స్ ను కూడా ప్రదర్శించబోతున్నారు. అంటే ఆడియన్స్ కు డబుల్ ధమాకా అన్నమాట. 13 సంవత్సరాల క్రితం ‘అవతార్’ విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల విడుల చేసిన ‘అవతార్ 2’ ట్రైలర్ విజువల్ మాయా ప్రపంచం అంటే ఏమిటో ప్రపంచానికి క్లారిటీగా చెప్పింది. ఆడియన్స్ లో మ్యాడ్ నెస్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 16ప అవతార్ 2 రిలీజ్ కానుంది. దీంతో డిస్నీ సంస్థ ఎంతో తెలివిగా ఈ వారంలో విడుదలకు కానున్న ‘డాక్టర్ స్ట్రేంజ్’ మూవీతో అవతార్ గ్లింప్స్ ని థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తోంది. ‘డాక్టర్ స్ట్రేంజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. దాంతో మార్వెల్ – జేమ్స్ కామెరాన్ కలయిక ఈ నెల 6 న సునామీ సృష్టిస్తుందన్నది బాక్సాఫీస్ పండితుల మాట. డాక్టర్ స్ట్రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యేలా అవతార్ ట్రైలర్ ప్రచారం కలిసొస్తోందన్నది వారి వాదన. గత వారం సినిమాకాన్ లో ‘అవతార్ 2’ మొదటి 3D టీజర్ ట్రైలర్ ని ప్రదర్శించారు. అంతే కాదు ప్రస్తుతం లాస్ వెగాస్ – సీజర్ ప్యాలెస్ లో జరుగుతున్న సినిమా థియేటర్ యజమానుల వార్షిక సమావేశంలోనూ ప్రదర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఈవారం భారీ సినిమాలు ఏవీ రిలీజ్ కావటం లేదు. శ్రీవిష్ణు నంటించిన ‘భళా తందనాన’, విశ్వక్ సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’, సుమ నటించిన ‘జయమ్మ పంచాయితీ’, రామ్ గోపాల్ వర్మ ‘మా ఇష్టం’ సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటన్నింటికీ మార్వెల్ స్టూడియో వారి ‘డాక్టర్ స్ట్రేంజ్’ చెక్ పెడుతుందనుకుంటే ఇప్పుడు దానికి తోడు ‘అవతార్2’ కూడా దెబ్బవేయనుంది. మరి ‘డాక్టర్ స్ట్రేంజ్’తో పాటు ‘అవతార్ 2’ దెబ్బను కాచుకుని నిలబడి హిట్ కొట్టే సినిమా ఏదన్నది తేలాల్సి ఉంది.