NTV Telugu Site icon

Getup Srinu: డైరెక్టర్ కానున్న మరో జబర్దస్త్ కమెడియన్.. సుధీర్ – గెటప్ శ్రీనులతో సినిమా?

Auto Ram Prasad Director

Auto Ram Prasad Director

Auto Ram Prasad to Direct a Movie with Getup Srinu and Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను. ఈ ముగ్గురు కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అలాంటి వారిలో ఇప్పటికే సుడిగాలి సుధీర్ బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నాడు. హీరోగా గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి సినిమాలు చేసి హిట్లు అందుకుని మరిన్ని సినిమాలు చేసే పనిలో ఉన్నాడు. మరొక పక్క గెటప్ శ్రీను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూనే హీరోగా కూడా మారుతున్నాడు. ఆయన హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమా 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తున్న క్రమంలో ఆటో రాంప్రసాద్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆటో రాంప్రసాద్ రైటింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కామెడీని నమ్ముకుని రాస్తూ వస్తున్నాడని, ఆయనకి సినిమాని హ్యాండిల్ చేయగల సత్తా ఉంటుందని నేను నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు.

Hema : పోలీసులకు తప్పుడు పేరిచ్చిన హేమ.. అందుకే ఇంత రచ్చ?

రాంప్రసాద్ తనను సుధీర్ ను ప్రధాన పాత్రలలో పెట్టుకుని ఒక సినిమా రాసుకుంటున్నాడ,ని అన్నీ కుదిరితే తమ సినిమాని పట్టాలెక్కిస్తామని చెప్పకొచ్చాడు. ఇక తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయని హీరోగా మళ్లీ అవకాశం వస్తే చేయగలనో లేదో కూడా చెప్పలేనని అన్నారు. రాజు యాదవ్ సినిమాలో కూడా తాను హీరోని కాదని కథే హీరో అని తాను ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద రాంప్రసాద్ డైరెక్టర్ గా మారితే సుధీర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలలో సినిమా చేస్తే కచ్చితంగా సినిమా మీద ఆసక్తి ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.