Hema : పోలీసులకు తప్పుడు పేరిచ్చిన హేమ.. అందుకే ఇంత రచ్చ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Hema Bangalore Rave Party News: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ పోలీసులకు చిక్కిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ కి పంపించారు. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అందులో 27 మంది మహిళల రక్త నమూనాలలో డ్రగ్స్ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. ఇక ఈ రేవ్ పార్టీలో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ టెస్టుల్లో నటి హేమకు పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హేమ గురించి మరో సంచలనం విషయం కూడా బయట పడింది. ఈ అంశం మరింత షాక్ కలిగిస్తోంది. అదేమంటే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి తన పేరు బయట పడకుండా జాగ్రత్త పడినట్లు తాజాగా వెల్లడైంది.
Also Read; Manam: మళ్ళీ మెస్మరైజ్ చేస్తోన్న మనం.. వైరల్ అవుతున్న వీడియోలు
Also Read
పార్టీలో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత వారి వివరాలు నోట్ చేసుకునే సమయంలో పోలీసులు అడిగినప్పుడు తన పేరు హేమ అని కాకుండా కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే ఆమె వివరాలు నోట్ చేసుకుని కృష్ణవేణి పేరుతోనే కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటం మొదలు ఈ వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. ముందుగా మీడియాలో హేమ ఈ పార్టీకి హాజరైనట్లు వార్తలు రావడం తర్వాత హేమ వీడియో రిలీజ్ చేసి నేను హైదరాబాదులోనే ఉన్నాను అని చెప్పడం జరిగింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. హేమ రక్త నమూనాలలో డ్రగ్స్ ట్రేసెస్ కనిపించడంతో ఆమెకు ముందు నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపబోతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!