Site icon NTV Telugu

Salaar: ఎన్ని సినిమాలొచ్చినా ఈ నెల ‘సలార్‌’దే…

Salaar Rights

Salaar Rights

సోషల్ మీడియా షేక్ అయిపోవాలన్నా, సర్వర్లు క్రాష్ అయిపోవాలన్నా, ఒక్క ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఉంటే చాలు అనేలా పోయిన రెండు నెలలు రచ్చ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ నెల కూడా ప్రభాస్‌దే హవా అని చెప్పొచ్చు. జూన్‌లో ఆదిపురుష్‌ రిలీజ్ అయి వివాదంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక జూలైలో సలార్ టీజర్ బయటికొచ్చి సోషల్ మీడియా రికార్డులను తిరగ రాసింది. ఇక ఇప్పుడు ఆగష్టులో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సోషల్ మీడియాను కబ్జా చేసేది మాత్రం సలార్ సినిమానే అని చెప్పొచ్చు. ఆగష్టులో మెగాస్టార్ ‘భోళా శంకర్’, సూపర్ స్టార్ ‘జైలర్’ సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయినా కూడా ఒక్క సలార్‌ అప్డేట్ వస్తే చాలు సోషల్ మీడియా షేక్ అవడం గ్యారెంటీ. ఇప్పటికే ఆగష్టులో సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని టీజర్ రెస్పాన్స్ చూసి సాలిడ్ ప్రామిస్ చేశారు మేకర్స్. అందుకే ఇప్పుడు సలార్ మంత్ స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి.

కనీసం ప్రభాస్ మొహం కూడా కనిపించని టీజర్‌కే డిజిటల్ రికార్డ్స్ అన్ని లేచిపోయాయ్. అలాంటిది ట్రైలర్ బయటికొస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. థియేటర్లో వచ్చే సినిమాలకంటే సలార్ ట్రైలర్ సృష్టించే సునామినే ఓ రేంజ్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఆగష్టు చివర్లో సలార్ ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ చేసే హంగామా ఓ రేంజ్‌లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అయితే ఒక్క ఆగష్టు నెల మాత్రమే కాదు సెప్టెంబర్ కూడా ప్రభాస్‌దే అని చెప్పొచ్చు. ఆ నెలలోనే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్‌ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా సలార్ రిలీజ్ కానుంది. మరి భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సలార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version