కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఎక్కడ విన్న యష్ పేరే వినిపిస్తోంది. ఒక్క సినిమా ఈ హీరోను దేశంలో ఓవర్‌నైట్ సెన్సేషన్ స్టార్ ను చేసేసింది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు యష్ నెక్స్ట్ చేయబోయే సినిమాపైనే ఉంది. వరుసగా రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా మూవీ చేస్తాడా..? కన్నడ సినిమా చేస్తాడా..? డైరెక్టర్ ఎవరు..? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులను తొలిచివేస్తున్నాయి.
షూటింగ్ అవ్వకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న హీరోల మధ్య సినిమా రిలీజ్ అయ్యి.. హిట్ అందుకున్నాక కూడా తదుపరి సినిమాను ప్రకటించకపోవడం అభిమానులను నిరాశపరిచే విషయమే. ప్రస్తుతం యష్ కెజిఎఫ్ 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడట.. ఇప్పటికే చాలా ఆఫర్లు వస్తున్నా ఆచితూచి అడుగువేయాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ ల విషయంలో కొంత సమయం తీసుకొంటున్నాడట రాఖీ భాయ్. అయితే అందుతున్న సమాచారం బట్టి మరో పాన్ ఇండియా వైపే యష్ అడుగులు వేస్తున్నాడని కన్నడ ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది. మరి ఈ రాకింగ్ స్టార్ ఎత్తుగడ ఏంటి..? అతని మనసులో నెక్స్ట్ ప్లాన్ ఏంటి ..? అనేది తెలియాలంటే యష్ తన తదుపరి సినిమాను ప్రకటించాల్సిందే..
