రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. గతంలో ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘ఖిలాడీ’ నుంచి మరో సాంగ్ విడుదలైంది.
Read Also : “లైగర్” ఫస్ట్ గ్లింప్స్… రౌడీ బాయ్ పవర్ ఫుల్ ఎంట్రీ
న్యూ ఇయర్ కానుకగా మేకర్స్ రవితేజ, మీనాక్షి చౌదరి కలిసి స్టెప్పులేసి “అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే” అంటూ సాగే మూడవ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘ఖిలాడీ’ పెప్పీ పార్టీ సాంగ్ పర్ఫెక్ట్ న్యూఇయర్ ట్రీట్ అని చెప్పొచ్చు. శ్రీ మణి సాహిత్యం అందించిన ఈ పాటను సమీరా భరద్వాజ్‌తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా పాడారు. లిరికల్ వీడియోలో హీరోహీరోయిన్లతో పాటు అద్భుతమైన కాస్ట్యూమ్స్, సెట్ విజువల్స్‌ను మరింత అట్ట్రాక్టివ్ గా చేస్తున్నాయి. ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
