Atlee: బాలీవుడ్‌లోనూ జోరు.. ముంబైలో రూ.38 కోట్ల సీ ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేసిన అట్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atlee: ‘జవాన్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడిగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న అట్లీ, ఇప్పుడు ముంబైలో కొత్త ఇంటిని కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ కు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమూవీకి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డ వేళ, అట్లీ కొనుగోలు చేసిన విలాసవంతమైన కొత్త ఇల్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా నివేదికల ప్రకారం, ముంబైలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో అట్లీ సముద్రానికి ఎదురుగా ఉండే లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఆస్తి విలువ సుమారు రూ.38 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు నివసించే ప్రీమియం ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్మెంట్, అరేబియా సముద్రం అందాలను నేరుగా వీక్షించే అవకాశం కల్పిస్తుందని సమాచారం. దీంతో అట్లీ ఇప్పుడు ముంబైలోని అత్యంత విలాసవంతమైన నివాస సముదాయాల్లో ఒకదానికి యజమానిగా నిలిచారు.
ఇక ఈ ఇంటిని అట్లీ తన భార్య ప్రియ కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయని సమాచారం. బాంద్రా ప్రాంతం ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులకు చిరునామాగా మారింది. అక్కడే నటి పూజా హెగ్డేకు కూడా సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన నివాసం ఉంది. ఇప్పుడు అదే ప్రాంతంలో అట్లీ కూడా స్థిరపడటంతో ఆయన బాలీవుడ్లో కూడా జోరు పెంచేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాది చిత్రసీమలో విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు హిందీ పరిశ్రమలోనూ ప్రముఖుల సరసన చేరినట్టే కనిపిస్తోంది. అట్లీ సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే, తొలి చిత్రం ‘రాజా రాణి’తోనే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అనంతరం తలపతి విజయ్‌తో తెరకెక్కించిన ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందించిన ‘జవాన్’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు చేసి, అట్లీని పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా నిలబెట్టింది. ఆ విజయంతో ఆయనకు బాలీవుడ్‌లోనూ భారీ అవకాశాలు లభించాయి.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ప్రస్తుతం అట్లీ పూర్తి దృష్టిని ‘రాకా’ చిత్రంపైనే కేంద్రీకరించారు. అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ ఫాంటసీ చిత్రం అత్యాధునిక విజువల్స్ తో రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమాల్లో వరుస విజయాలు, మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్లో పెట్టుబడులు చూస్తుంటే, అట్లీ కెరీర్ మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా అదే స్థాయిలో ముందుకు సాగుతోందని చెప్పవచ్చు. దర్శకుడిగా తన ముద్ర వేస్తూనే, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఆయన ప్రయాణం ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!