Site icon NTV Telugu

Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్

Chy

Chy

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే మిగతా హీరోలతో పోలిస్తే.. చై ఒకందుకు వెనుకే ఉన్నాడని చెప్పాలి. అందరూ.. పాన్ ఇండియా.. పాన్ ఇండియా అని వెళ్తుంటే .. చై మాత్రం చాలా సెలెక్ట్డ్ గా సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకొకటి దూత అనే వెబ్ సిరీస్ ఇప్పటికే రిలీజ్ కు రెడీ అవుతుంది. డిసెంబర్ 1 న అమెజాన్ లో దూత స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రమోషన్స్ లో చై కష్టపడుతున్నాడు. తాజాగా చై చేసిన ఒక పని.. అభిమానులను ఫిదా చేస్తోంది.

Sound Party Trailer: బిగ్ బాస్ సన్నీ కొత్త సినిమా.. సౌండ్ అదిరేలానే ఉందే

తాజాగా చై.. హైదరాబాద్ లో ఉన్న సెయింట్ జూడ్స్‌ బాలల ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులతో కలిసి చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ చిన్నారులతో చై.. చాలా సమయం గడిపాడు. వారితో ఆడి పాడాడు. వారికోసం ఎన్నో గిఫ్ట్ లు తీసుకెళ్లి.. ఆ చిన్నారుల ముఖంలో నవ్వులు కురిపించాడు. చిన్నారులకు కావాల్సిన కొన్ని వస్తువులను సైతం చై వారికి అందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి చై తన సినిమాలతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Exit mobile version