Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవలే సీతారామం చిత్రంతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్దిరోజుల్లో పుష్ప 2 చిత్రం షూటింగ్ లో పాల్గొననుంది. ఇక గత కొన్నిరోజుల క్రితం రష్మిక.. జ్యోతిష్యుడు వేణు స్వామితో పూజలు చేయించిన విషయం విదితమే. ఆమె జాతకంలో ఉన్న కొన్ని దోషాలను పోగేట్టేందుకు ఆయన రాజశ్యామల, తార పూజలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆమె జాతకాన్ని బట్టి ముందు ముందు ఎలా ఉండబోతుందో కూడా వేణు స్వామి వివరించాడు. రష్మిక- రక్షిత్ శెట్టితో విడిపోయాక ఆమె జీవితం బావుంటుందని ముందే చెప్పినట్లు తెలిపాడు. ఆయన చెప్పినట్లు గానే రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకున్నాకా అమ్మడు స్టార్ హీరోయిన్ కాదు కాదు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.
ఇక రష్మిక జాతకం ప్రకారం ఆమె రానున్న రోజుల్లో రాజకీయాల్లో చేరే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా ఫ్యూచర్ లో ఆమె లోక్ సభ ఎంపీగా గెలవనుందని వేణు స్వామి చెప్పాడు. కన్నడ హీరోయిన్ రమ్య మాదిరిగానే అటు ఎంపీగా ఇటు నటిగా కొనసాగానున్నదట. మంచి రాజకీయ భవిష్యత్తు రష్మిక జాతకంలో కనిపిస్తున్నదని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ జ్యోతిష్యం, జాతకాలూ అన్ని ఉత్తి మాటలే అనుకొంటే .. గతంలో సమంత- నాగ చైతన్య విడిపోతారని వేణు స్వామి నాలుగేళ్ళ క్రితమే చెప్పాడు. చెప్పినట్లే జరిగింది. ఇటీవల విజయ్ దేవరకొండ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది.. లైగర్ ప్లాప్ అవుతుంది అని చెప్పాడు.. చెప్పినట్లే జరిగింది.. మరీ రష్మిక విషయంలో ఈ జ్యోతిష్యుడు చెప్పినది జరుగుతుందో లేదో చూడాలి.
