Astrologer Venu Swamy About Bigg Boss 7 Winner Pallavi Prashanth: సెలబ్రిటీల జీవితాల గురించి మాట్లాడుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వేణు స్వామి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ గురించి వేణు స్వామి కామెంట్ చేశాడు. నిజానికి బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కప్ గెలిచిన రెండు మూడు రోజులకే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం మీద వేణు స్వామి మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కప్ గెలిచాడు, బయటకు వచ్చాక ఏమైంది? అని ప్రశ్నించారు. డీసీపీ జోయల్ డేవిస్ చాలా పద్ధతి గల మనిషి, సిద్దిపేటలో చేసి ఇక్కడికి వచ్చారని అన్నాడు. కేరళ నుంచి వచ్చిన జోయల్ డేవిస్ చాలా మంచి ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చాలా బతిమాలాడాడు, ఆయన స్థాయి వ్యక్తి దిగజారి అలా బతిమలాడడం చూడలేదు.
Minister Tummala: సంక్షేమ పథకాలు అమలు కొంత ఆలస్యం అవ్వొచ్చు.. కానీ..
అలాంటిది ఆయన వచ్చి పల్లవి ప్రశాంత్ కి దండం పెట్టాడు, దండం పెట్టి బాబు, నాయన నువ్వు ఒక్కడివి అద్దాలు దించుకుని వెళితే అందరూ వెళ్ళిపోతారు అని అతనికి చెప్పినపుడు అతను వినలేదు. వినకుండా మళ్ళీ అక్కడికే వచ్చాడు. దాని వల్ల ఎంత నష్టం జరిగింది? అతనికి వచ్చినంత క్రెడిట్ అదే కంటిన్యూ అయి ఉంటే ఈ రోజు బిగ్ బాస్ విన్నర్ గా అతని స్థాయి వేరు. కానీ ఇప్పుడు ఒక్కసారి యూటర్న్ తీసుకువెళ్ళినందుకు జీరో అయ్యాడు. అందుకే సెలబ్రిటీ స్టేటస్ ను నిలబెట్టుకోవడం చాలా కష్టం అని వేణు స్వామి అన్నారు. అలాగే డబ్బును కాపాడుకోవడం, ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడం కష్టం అని అంటూ ఆయన కామెంట్ చేశారు.