NTV Telugu Site icon

Agent Movie: దేవుడే మమ్మల్నికాపాడాడు.. ఏజెంట్ సినిమాపై ఏషియన్ సునీల్ కామెంట్స్!

Asian Suniel On Agent Movie

Asian Suniel On Agent Movie

Asian Suniel intresting comments on akhil agent movie: అక్కినేని మూడో తరం హీరో అయిన అఖిల్ చివరిగా ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర తెరకెక్కించిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. మమ్ముట్టి లాంటి సీనియర్ స్టార్ హీరో ఉన్నా ఈ సినిమాను కాపాడలేకపోయాడు. ఇక ఈ సినిమాను చంపింది దిల్ రాజు, శిరీష్ లే అంటూ అప్పట్లో నట్టికుమార్ కొన్ని ఆరోపణలు చేశారు.
Mega Princess: మెగా ప్రిన్సెస్ ఫోటోలు లీక్.. మెగా ఫ్యామిలీ సంచలన నిర్ణయం?
ఈ సినిమాని ఫస్ట్ ఏషియన్ సునీల్ గారు తీసుకున్నారని కానీ దిల్ రాజు, శిరీష్ రెడ్డి రంగంలోకి దిగి.. ఎవర్నీ సినిమా కొనద్దని.. కొన్నా థియేటర్స్ ఇవ్వొద్దని చెప్పారని ఆయన అప్పట్లో ఆరోపించారు. ఏజెంట్ సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా దాదాపు 230 థియేటర్స్‌ PS2 మూవీకి ఇచ్చారని తాను విన్నానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ మాటలకు పూర్తి భిన్నంగా ఏషియన్ సునీల్ కొన్ని కామెంట్లు చేశారు. ఏజెంట్ సినిమా హక్కులు మేము ఆరుగురం కలిసి తీసుకుందామని అడిగామని కానీ నిర్మాత భారీ రేటు డిమాండ్ చేశాడని ఆయన అన్నారు. అంత రేటు వర్కౌట్ అవ్వదులే అని చెప్పి వేరే వాళ్లకి అమ్ముకోమని చెప్పామని, ఈ విషయంలో దేవుడు మమ్మల్ని కాపాడాడు అని ఏషియన్ సునీల్ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంలో అసలు ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ కొన్ని భిన్నమైన వాదనలు తెర మీదకు వస్తున్నాయి.

Show comments