Site icon NTV Telugu

మొన్న మహేశ్, నిన్న విజయ్ దేవరకొండ, నేడు అల్లు అర్జున్!

సినిమా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాలలో ఏషియన్ ఫిలిమ్స్ కొన్నేళ్ళుగా తన సత్తాను చాటుతోంది. అంతేకాదు, పాత సినిమా థియేటర్లను రెన్నోవేట్ చేయడం, కొత్త థియేటర్ల ను నిర్మించడం వంటి కార్యక్రమాన్ని కొంతకాలంగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఏషియన్ ఫిలిమ్స్ ప్రిన్స్ మహేశ్ బాబుతో హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘ఎఎంబి’ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ ను నిర్మించింది. అలానే విజయ్ దేవరకొండతో కలిసి మహబూబ్ నగర్ లోనూ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిపి, ఇటీవల ప్రారంభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ ఈ సంస్థ చేతులు కలిపి, హైదరాబాద్ లో ‘ఎఎఎ’ పేరుతో మల్టీప్లెక్స్ ను నిర్మించబోతోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినీ నిర్మాణ సముదాయంలో జరిగిన పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సౌకర్యాలతో ఈ థియేటర్ల నిర్మాణం జరుగుతోందని ఏషియన్ ఫిలిమ్స్ అధినేతలు నారాయణ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తెలిపారు.

Exit mobile version