Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క కోర్టు కేసుల ఉచ్చు బిగుస్తుంటే, మరోపక్క తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె ఇచ్చిన సడెన్ అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నెటిజన్లు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలు అషురెడ్డితో పాటు ఆమె తల్లి యశోదరెడ్డిపై ఉన్న సంగతి తెలిసిందే. తమపై నమోదైన ఈ కేసు దర్యాప్తును నిలిపివేయాలని (స్టే ఇవ్వాలని) కోరుతూ వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం వారికి గట్టి షాక్ ఇచ్చింది. దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం ససేమిరా అంది.
అంతేకాకుండా, విచారణ సమయంలో పోలీసుల కఠిన చర్యల నుంచి తమకు మినహాయింపు (ముందస్తు రక్షణ) కల్పించాలన్న వారి అభ్యర్థనను కూడా కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీంతో ఈ కేసు విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితుల్లో అషురెడ్డి ఇరుక్కున్నారు. హైకోర్టు తీర్పుతో అషురెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉంటుందని, తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటని అంతా భావిస్తున్న తరుణంలో ఆమె ఒక బాంబు పేల్చింది. ఎవరూ ఊహించని విధంగా తనకు ‘ఎంగేజ్మెంట్’ అయిపోయిందంటూ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒకవైపు పెళ్లి పేరుతో మోసం చేశారనే కేసులో విచారణకు బ్రేకులు వేయడానికి కోర్టు నిరాకరించడం.. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే తాను పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఎంగేజ్మెంట్ వార్తను కన్ఫర్మ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆమె ఎవరిని చేసుకోబోతోంది? ఇదంతా కేసుల నుంచి జనాల దృష్టి మళ్లించే వ్యూహమా? లేక ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ ఎంగేజ్మెంట్ జరిగిందా? అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అషురెడ్డి వ్యవహారం ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..