Site icon NTV Telugu

Ashu: రేంజ్ రోవర్ కొన్న అషు రెడ్డి.. భలే హ్యాపీగా ఉందంటున్న వేణుస్వామి

Ashu

Ashu

Ashu Reddy Buys a Range Rover: కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంత కు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా గుర్తింపు దక్కించుకుని ఏకంగా సినిమా అవకాశం దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుని షాక్ ఇచ్చింది. బిగ్ బాస్. సీజన్ 3 మరియు ఓటీటీ బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది. ప్రతి టాస్క్ లోనూ ఎంతో యాక్టివ్ గా కనిపించి క్రేజ్ ను దక్కించుకకోవడమే కాక బిగ్ బాస్ తరువాత కొద్ది రోజులకే రామ్ గోపాల్ వర్మతో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్ గా మారింది.

Bigg Boss Telugu 7: ఆ అపవాదు పోగొట్టుకునేందుకు ఈ వారం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్?

ఈమెకు చేతి నిండా సినిమాలు లేకున్నా అమెరికా, దుబాయ్, ఇండియా షటిల్ సర్వీస్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ భామ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే అషు రెడ్డి తాజాగా ఒక రేంజ్ రోవర్ కారును లక్షలాది రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ఇక ఆ కారుకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కొబ్బరికాయతో దిష్టి తీసి పూజ చేశారు. తనను నమ్మిన వారు ఇలా వృద్ధిలోకి వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందని, ఆ ఆనందం మామూలుది కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వేణుస్వామి ప్రముఖ హీరోయిన్లకు కూడా అనేక పరిహార పూజలు చేశారు. ఆ పూజల అనంతరం వారు వృద్ధిలోకి వచ్చారని కూడా వేణుస్వామి చెబుతూ ఉంటారు.

Exit mobile version