సంక్రాంతి పండగనాడు కాబోయే భార్యను పరిచయం చేసిన విశ్వక్ సేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాగల్ చిత్రంతో గతేడాది పలకరించిన హీరో విశ్వక్ సేన్.. ఈ ఏడాది మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం ”అశోకవనంలో అర్జున కళ్యాణం”. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు – సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో విశ్వక్.. నెలకు 70 వేల జీతం సంపాదిస్తూ 34 ఏళ్ళు దాటిపోయినా పెళ్లికాని అల్లం అర్జున్ కుమార్ పాత్రలో కనిపించనున్నాడు. మీకెవరికైనా పెళ్లి కూతురు దొరికితే చెప్పండి అంటూ పోస్ట్ పెట్టిన అల్లం అర్జున్ కి పెళ్లికూతురు దొరికేసింది. ఈ సంక్రాంతి నాడు తనకు కాబోయే భార్యను పరిచయం చేసి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకంక్షలు తెలిపాడు.
అల్లంగారి పెళ్లి కూతురు అంటూ హీరోయిన్ ని మేకర్స్ ఒక వీడియో ద్వారా పరిచయం చేశారు. ఇందులో పలుపులేటి మాధవి గా రుక్సార్ థిల్లర్ కనిపించనుంది. కృష్ణార్జున యుద్ధం, ఎబిసిడి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ”అశోకవనంలో అర్జున కళ్యాణం” చిత్రంలో విశ్వక్ సరసన నటించనుంది. ఇక ఈ వీడియోలో వీరిద్దరి మధ్య రొమాన్స్ చూస్తుంటే సినిమాలో కూడా మంచి రొమాన్స్ ని చూపిస్తున్నట్లు అర్ధమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Also Read
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
- VrushaKarma : భారీ ధర పలికిన 'వృషకర్మ' నైజాం థియేట్రికల్ రైట్స్
- Raaka: 'రాకా'లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!